×
Ad

National Awards : నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే..

నేషనల్ అవార్డ్స్ గెలిచిన గ్రహీతలు నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. (National Awards)

1/15
ఇటీవల 71వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 లో రిలీజయిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. నేషనల్ అవార్డ్స్ గెలిచిన గ్రహీతలు నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
2/15
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమాకు అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు.
3/15
హనుమాన్ సినిమాకు బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు వచ్చింది. ఇందుకు ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్స్ గా పనిచేసిన నందు, పృథ్వీలు అవార్డులు అందుకున్నారు.
4/15
5/15
ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ విభాగంలో హనుమాన్ సినిమా అవార్డు గెలుచుకోగా ఇందుకు యానిమేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేసిన వెంకట్ కుమార్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి అవార్డులు అందుకున్నారు.
6/15
7/15
8/15
బలగం సినిమాలోని 'ఊరు పల్లెటూరు..' సాంగ్‌కు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు.
9/15
బేబీ సినిమాకు ఉత్తమ్ స్క్రీన్ ప్లే కు గాను దర్శకుడు సాయి రాజేష్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ప్రేమిస్తున్నా. సాంగ్ కు PVNS రోహిత్ అవార్డులు అందుకున్నారు.
10/15
11/15
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు సినిమాకు అవార్డు అందుకుంది.
12/15
13/15
అలాగే మన తెలుగు దర్శకులు చేసిన సినిమాలకు పలు అవార్డులు వరించాయి. ఇందులో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమాకు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవార్డుని హర్షవర్ధన్ రామేశ్వర్ హిందీ భాష ఎంట్రీ నుంచి అందుకున్నారు. యానిమల్ సినిమాకు బెస్ట్ సౌండ్ డిజన్ కు హరిహరన్, సచిన్ సుధాకరన్ అవార్డులు అందుకున్నారు.
14/15
15/15
అలాగే వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన వాతి సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ gv ప్రకాష్ కుమార్ తమిళ భాష ఎంట్రీ నుంచి అందుకున్నారు.