Varanasi: మెక్సికోలో ‘వారణాసి’ స్పెషల్ గ్లింప్స్.. విజువల్స్ కి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా.. ఇది జక్కన్న రేంజ్ ప్రమోషన్స్
కామిక్-కాన్ 2026 మెక్సికో ఫస్ట్ లో వారణాసి(Varanasi) స్పెషల్ గ్లింప్స్ ప్లే చేయడం జరిగింది.
- V Santhosh Kumar
- Updated on- April 25, 2026 / 09:38 AM IST
A special glimpse of Varanasi was showcased at the Comic Con Experience 2026.
- మెక్సికో ఫస్ట్ లో వారణాసి ఫస్ట్ గ్లింప్స్
- హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కి ఆడియన్స్ ఫిదా
- వైరల్ అవుతున్న రాజమౌళి వీడియో బైట్
Varanasi: మెక్సికో సిటీ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘CCXP MX 2026’ పాప్ కల్చర్ ఫెస్టివల్‌లో రాజమౌళి – మహేశ్ బాబు కలయికలో రాబోతున్న ‘వారణాసి(Varanasi)’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్‌ను విడుదల చేయగా, అక్కడి హాలీవుడ్ ప్రేక్షకులు వారణాసి విజువల్స్‌కు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో సందేశం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. భారతీయ పురాణాలను, ప్రపంచ స్థాయి యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని ఒక గొప్ప అడ్వెంచర్‌గా మలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Kriti Sanon: బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కృతి సనన్ మెరుపులు.. చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం
ముఖ్యంగా హీరో మహేశ్ బాబు గురించి రాజమౌళి చెప్పిన మాటలు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారని ఆయన భరోసా ఇచ్చారు. గ్లింప్స్‌లో మహేశ్ బాబు రఫ్ అండ్ టఫ్ లుక్, పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మైనస్ డిగ్రీల చలిలో చిత్రీకరించిన అత్యున్నత స్థాయి విజువల్స్, ఎం.ఎం. కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ ఈ చిన్న గ్లింప్స్‌నే హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లాయని అక్కడి సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
‘RRR’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో హాలీవుడ్ మేజర్ స్టూడియోలు సైతం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నాయి. మెక్సికోలో వచ్చిన ఈ అద్భుతమైన స్పందన సినిమా గ్లోబల్ మార్కెట్ విజయానికి నాందిగా కనిపిస్తోంది. భారీ గ్రాఫిక్స్ మరియు ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ టాక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX— REFORMA (@Reforma) April 25, 2026
