మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు చేసిన ప్రదర్శనలు పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.