Apple iPhone 16 Plus : సూపర్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 16 ప్లస్ చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

Apple iPhone 16 Plus : అమెజాన్‌లో ఆపిల్ కొత్త ఐఫోన్ 16 ప్లస్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఇలా కొనేసుకోండి.

1/6
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ లాంచ్ అయిన వెంటనే పాత ఐఫోన్ల మోడల్స్ ధరలు భారీగా తగ్గాయి. కొత్త ఐఫోన్ 17 ప్లస్ కోసం చాలా మంది ఆపిల్ అభిమానులు ఎదురుచూశారు. కానీ, ప్లస్ లైనప్ విషయంలో ఆపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
2/6
కానీ, పాత ఐఫోన్ 16 ప్లస్ మోడల్ తక్కువ ధరకే లభిస్తోంది. మీరు కూడా ఇలాంటి ఆఫర్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.
3/6
దాంతో ఈ ఐఫోన్ ధర రూ. 10,500 కన్నా తగ్గింది. పాపులర్ ఐఫోన్ మోడళ్లపై ఇలాంటి డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. ఆఫర్ ముగిసేలోగా ఐఫోన్ 16 ప్లస్ సొంతం చేసుకోండి.
4/6
అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్లస్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.78,999కి లిస్ట్ అయింది. ఈ ఐఫోన్‌పై రూ.10,901 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.
5/6
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్‌కు పవర్ కోసం ఆపిల్ A18 చిప్‌సెట్ కలిగి ఉంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఇంకా, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగి ఉంటుంది. టెక్ దిగ్గజం ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుంది.
6/6
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.