Bharat Jodo Yatra In AP: ఏపీలో ముగిసిన భారత్ జోడో యాత్ర.. మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్

Bharat Jodo Yatra In AP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది. శుక్రవారం యాత్రలో భాగంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాహుల్ సందర్శించారు. తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి, మందిరం వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రాలయంలో శ్రీ సుబుధేంద్ర తీర్థ జీని కలిశారు. ఉదయం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌ నుంచి ప్రారంభమైన రాహుల్‌ జోడో యాత్ర.. మాధవరం, తుంగభద్ర వంతెన మీదుగా ఏపీ నుంచి కర్నాటకలోకి ప్రవేశించింది. ఏపీలో నాలుగు రోజులు పాటు సాగినయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి వ్యక్తులతో నేను పొందిన ప్రేమ బంధం లోతైనది, దృఢమైనది, ఈ ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాం అంటూ రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో రాశారు. ఏపీలో మొత్తం 96కిలో మీటర్లకుపైగా పాదయాత్ర సాగింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ నెల 23న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

ట్రెండింగ్ వార్తలు