Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో ఆదివారం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 29, 2026 / 11:06 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గత నాలుగు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ స్వల్పంగా బలహీనపడటం లేదా భారత రూపాయి విలువలో హెచ్చుతగ్గులు రావడం వల్ల దేశంలో బంగారం ధర పెరుగుతుంది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 161 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,488 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,750 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,220 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,35,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,48,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,35,750 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలో ఇవాళ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్దకు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
