Gold and Silver Rates Today : బంగారం కొనుగోలుదారులకు భారీ శుభవార్త.. ధరలు ఢమాల్.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు భారీ శుభవార్త. ఇవాళ బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు ఇవాళ భారీగా తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1200 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1100 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై ఐదు డాలర్లు తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 5,068 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. గత రెండు రోజులుగా వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గురువారం కూడా వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,200 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,400కు చేరింది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,350కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,58,560కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,200కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,400కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,00,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
