బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగ్గా.. వెండి స్వల్పంగా పెరిగింది.
2/8
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, విధానాలపై స్పష్టత లేకపోవటం వల్ల సేఫ్ హావెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల విలువైన లోహాలకు మద్దతు లభిస్తోంది. డిమాండ్–సరఫరా పరిస్థితులు రోజువారీ ధరల కదలికలపై ప్రభావం చూపుతాయి. సీజనల్ డిమాండ్, నగల కొనుగోళ్లు, పరిశ్రమల వినియోగం ఈ మార్పుల్లో పాత్ర పోషిస్తాయి. మరోవైపు రూపాయి–డాలర్ మారకపు విలువ కూడా కీలకం. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. అప్పుడు ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నా బంగారం, వెండి ధరలుపైకి వెళ్లే అవకాశం ఉంటుంది.
3/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,350 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,470 పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 78 డాలర్లు పెరగడంతో.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,988 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
4/8
వెండి ధరసైతం పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై రూ.20వేలు పెరగ్గా.. ఇవాళ (శనివారం) స్వల్పంగా పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,45,400కు చేరుకోగా.. 24క్యారట్ల ధర రూ.1,58,620కు చేరింది.
6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,550కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,58,770కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,400కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,620కు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,60,100 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,55,100 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,60,100 వద్ద కొనసాగుతుంది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.