Telugu » Photo-gallery » Gold And Silver Price In Hyderabad Visakhapatnam Delhi Today January 2nd 2026 Full Details Hn
Gold and silver price : సీన్ రివర్స్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే..
Gold and silver price : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి.
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్.
2/9
వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి.
3/9
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామలు 24 క్యారట్ల బంగారంపై రూ.1,140 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,050 పెరిగింది.
4/9
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 46 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,375 వద్ద ట్రేడవుతోంది.
5/9
వెండి ధరసైతం భారీగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు కిలో వెండిపై రూ. 29వేలు తగ్గగా.. శుక్రవారం మాత్రం కిలో వెండిపై రూ. 4వేలు పెరిగింది.
6/9
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,24,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,36,200కు చేరింది.
7/9
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,25,000 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,36,350కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,24,850 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,35,060కు చేరింది.
8/9
వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,42,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతుంది.
9/9
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.