Gold Silver Rate Today : పదిరోజుల తరువాత బంగారం ధరల్లో బిగ్ఛేంజ్.. ఊహించని మార్పు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Rate Today : బంగారం ధరలో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు పెరగ్గా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

Gold Silver Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పది రోజుల తరువాత బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1470 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 15డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,332 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వెండి రేటు.. ఇవాళ కూడా స్థిరంగా కొనసాగుతోంది. వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,400 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,310 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,910కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,000వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
