Gold Silver Price Today : అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..
Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో నేడు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold Silver Price Today : అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తోపాటు ఇరాన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. దీంతో ఇన్నాళ్లు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎండ్ కార్డు పడింది. దీంతో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,450 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 107 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.10వేలు పెరిగింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,51,530 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,900 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,680 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,530కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,38,900కు చేరింది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
