Kavya Kalyanram : రాజమౌళి ఫ్యామిలీ అబ్బాయితో ప్రేమ.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్..
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, బలగం, మసూద.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా తను ప్రేమిస్తున్న అబ్బాయిని ప్రకటించింది. కీరవాణి పెద్ద కొడుకు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు తెలుపుతూ అతనితో క్లోజ్ గా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నా ఎవరూ స్పందించలేదు. తాజాగా కావ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. కాలభైరవ కూడా కావ్యతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించాడు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.











