మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మిత కూడా హాజరయ్యి సందడి చేశారు. ఈ మూవీకి సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.