తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనేకమంది హీరోలు వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో విచ్చేశారు.