‘ఆర్ఎక్స్ 100’ టాలీవుడ్‌లో హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిన్నది పాయల్ రాజ్‌పుత్. ఆమె నటిస్తున్నసినిమా ‘మాయా పేటిక’. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాయల్ సందడి చేసింది.