×
Ad

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని.. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వైరల్

భారత ప్రధాని మోదీ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవి ఆలయానికి చేరుకున్న ప్రధానికి అర్చకులు, దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 50 నిమిషాల పాటు గడిపిన ప్రధాని, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మొదట మల్లికార్జునస్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబదేవి సన్నిధిలో ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా శ్రీశైలం చేరుకున్నారు. వీరు కూడా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Publish Date - October 16, 2025 / 03:46 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9