PM Modi Attends Christmas Event : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని చారిత్రాత్మక క్యాథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ ను సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చికి చేరుకున్న మోదీకి బిషప్ పాల్ స్వరూప్, ఇతర మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలను పంచుకున్నారు. క్యాథెడ్రల్ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏసుక్రీస్తు బోధనలు మన సమాజంలో ప్రేమ, శాంతి, సోదరభావాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.