Draupadi Murmu: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటో గ్యాలరీ)
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసీ బీపీల్ పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతోపాటు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్లి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ పండితులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రసాద్ పథకం ద్వారా చేపట్టనున్న పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.