మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నారు. కాగా దుబాయ్ లో ఉన్న ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ ఉపాసనకు సీమంతం నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.