Dhurandhar 2 : పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా.. ఎగబడి చూస్తున్న పాకిస్తానీలు..

రణవీర్ సింగ్ దురంధర్ సినిమాకు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ ఇటీవల మార్చ్ 19న రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. (Dhurandhar 2)

  • Published On : March 21, 2026 / 11:55 AM IST

Dhurandhar 2

Dhurandhar 2 : రణవీర్ సింగ్ దురంధర్ సినిమాకు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ ఇటీవల మార్చ్ 19న రిలీజ్ అయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ స్పై పాకిస్తాన్ కి వెళ్లి, అక్కడి వాళ్లలో కలిసిపోయి ఎదిగి అక్కడ భారత్ కి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లను ఎలా చంపేశాడు, అక్కడి సమాచారం ఇండియాకు ఎలా పంపించాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు వసూలు చేసి భారీ హిట్ కొడితే సెకండ్ పార్ట్ అంతకు మించి కలెక్ట్ చేసేలా ఉంది. అయితే ఈ సినిమాని పాకిస్తానీలు కూడా ఎగబడి చూస్తున్నారట. పాకిస్తాన్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వకపోయినా పైరసీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకొని మరీ చూస్తున్నారట.

Also Read : Punarnavi Bhupalam : నటి పునర్నవి భూపాలం పెళ్లి ఫొటోలు చూశారా..?

గతంలో దురంధర్ సినిమాకు కూడా పాకిస్తాన్ లో ఈ సినిమాని పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూసారు. పాకిస్తాన్ లో అత్యధికంగా పైరసీ చేసి చుసిన సినిమాగా దురంధర్ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 సినిమాని కూడా తెగ డౌన్లోడ్ చేసుకొని పైరసీలో చూస్తున్నారట పాకిస్తానీలు. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా చేసిన సినిమాని పాకిస్తానీలు ఎగబడి చూడటం గమనార్హం.

అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం జరుగుతుండటంతో అక్కడ సినిమా రిలీజ్ అవ్వలేదు. దీంతో అక్కడ కూడా ధురంధర్ 2 సినిమాని పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారట. మొత్తానికి దురంధర్ 2 సినిమా ఇండియాలోనే కాక పాకిస్తాన్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ప్రజాదరణ పొందుతుంది.

Also See : Nara Devansh Birthday : మనవడి పుట్టిన రోజు.. తిరుమలలో దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు అన్నదానం..