Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. అమెజాన్‌లో ఈ S25 అల్ట్రా ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభానికి ముందే ఈ శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గింది.

Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్‌కు పోటీగా ఏకైక బ్రాండ్ శాంసంగ్ అని చెప్పొచ్చు. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్ మార్కెట్లో బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ రేంజ్ ఫోన్లలో లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కూడా ఒకటి. అల్టిమేట్ షాట్ ప్రాసెసర్ కెమెరా కలిగి ఉంది. ఇప్పుడు, ఈ అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు ముందు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 12GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 1,29,999కు బదులుగా రూ. 1,07,999 కు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు ద్వారా అమెజాన్ పే బ్యాలెన్స్ పై రూ. 3,239 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

డీఎక్స్ యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్ యూఐ7 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందింది. పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 10MP టెలిఫోటో షూటర్ వంటి క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ సెన్సార్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.