Shanmukh Jaswanth Marriage: పెళ్లి ఫోటోలు షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. కొత్త జంట ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రేయసి వైష్ణవిని వివాహం(Shanmukh Jaswanth Marriage) చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షణ్ముఖ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








