Sharmiela Mandre : నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు..
కన్నడ నటి షర్మిలా మాండ్రే కన్నడలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తుంది . తెలుగులో ఒకేఒక్క సినిమా అల్లరి నరేష్ సరసన కెవ్వు కేక లో నటించింది ఈ కన్నడ భామ. తాజాగా షర్మిలా మాండ్రే తమిళ నిర్మాత సుధన్ సుందరంతో నిశ్చితార్థం చేసుకుంది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. షర్మిలా మాండ్రే వీరి నిశ్చితార్థ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు.








Sharmiela Mandre Engaged with Producer Sudhan Sundaram
