బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్, లవ్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఇటీవల ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రాజస్థాన్ జైసల్మీర్ లో వివాహం చేసుకున్నారు. తాజాగా ఆదివారం నాడు ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్ లో సిద్దార్థ్-కియారా రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.