×
Ad

SA20 : ముచ్చ‌ట‌గా మూడోసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేత‌గా స‌న్‌రైజ‌ర్స్.. కావ్య పాప ఆనందాన్ని చూశారా?

ముచ్చ‌ట‌గా మూడోసారి సౌతాఫ్రికా టీ20లీగ్ విజేత‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య మార‌న్ ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. (pics credit@SunrisersEC, @SA20_League)

1/11
సౌతాఫ్రికా టీ20లీగ్ విజేత‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
2/11
ఈ లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ముచ్చ‌ట‌గా మూడో సారి విజేత‌గా నిల‌వ‌డం విశేషం. గ‌తంలో 2023, 2024లో కూడా స‌న్‌రైజ‌ర్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ క‌ప్పును ముద్దాడింది.
3/11
ఈ సీజ‌న్ నాలుగోది కాగా.. మ‌ధ్య‌లో అంటే 2025లో ఒక్క‌సారి ముంబై కేప్ టౌన్ విజేత‌గా నిలిచింది
4/11
ఫైన‌ల్ మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది.
5/11
ప్రిటోరియా బ్యాట‌ర్ల‌లో బ్రైస్ పార్సన్స్ (30), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (17) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు.
6/11
స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీశాడు. లూథో సిపామ్లా, అన్రిచ్ నోర్ట్జే చెరో వికెట్ సాధించారు.
7/11
అనంత‌రం మాథ్యూ బ్రీట్జ్కే(68 నాటౌట్; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (63 నాటౌట్; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
8/11
మిగిలిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో జానీ బెయిర్ స్టో గోల్డెన్ డ‌కౌట్ కాగా.. క్వింట‌న్ డికాక్ (18) ప‌ర్వాలేద‌నిపించాడు.
9/11
ప్రిటోరియా బౌల‌ర్ల‌లో లుంగీ ఎంగిడి, రోస్టన్ ఛేజ్, లిజాద్ విలియమ్స్, కేశవ్ మహారాజ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.
10/11
ఈ విజయంతో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఫైన‌ల్ మ్యాచ్‌కు హాజ‌రైన ఆమె దగ్గరుండి జట్టును గెలిపించింది.
11/11