×
Ad

Richest Indian cricketers : 2025లో టాప్ 5 ధ‌న‌వంతులైన భారత క్రికెటర్లు ఎవరు?

భారతదేశంలో అత్యధికంగా డబ్బు సంపాదించే క్రీడలలో క్రికెట్ ఒకటి. దేశంలోని అగ్ర‌శేణి ఆట‌గాళ్లు బీసీసీఐ కాంట్రాక్టు, ఐపీఎల్ జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీ మొత్తాల‌నే సంపాదిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆడుతున్న వారిలో 2025 ముగిసే నాటికి ప‌లు నివేదిక‌ల ఆధారంగా టాప్-5లో నిలిచిన ధ‌న‌వంతులైన భార‌త ఆట‌గాళ్లు వీరే.

1/5
అత్యంత ధ‌నవంతుడైన భార‌త క్రికెట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా ఒక‌రు. 2025 నాటికి అతని నికర విలువ రూ. 91 నుంచి 98 కోట్ల మధ్య ఉంటుంది. బీసీసీఐ గ్రేడ్ ఏ కాంట్రాక్టును క‌లిగి ఉన్నాడు. దీంతో ఏటా 5 కోట్లు బీసీసీఐ అత‌డికి జీతంగా ఇస్తుంది. మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు అద‌నం. ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ అత‌డిని రూ.16.35 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది.
2/5
2025 నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర ఆస్తి విలువ దాదాపు రూ.60 నుండి 70 కోట్లుగా అంచ‌నా. అతని సంపాదనలో ఎక్కువ భాగం అతని BCCI గ్రేడ్ A+ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి వస్తుంది. ఇది సంవత్సరానికి రూ.7 కోట్లు. మ్యాచ్ ఫీజులతో పాటు ఐపీఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. ముంబై ఇండియన్స్ అత‌డిని రూ. 18 కోట్లకు రిటైర్ చేసుకుంది.
3/5
2025 నాటికి రిష‌బ్ పంత్ నికర ఆస్తి విలువ దాదాపు రూ.100 కోట్లు అని అంచనా. అతడు BCCI గ్రేడ్ A సెంట్రల్ కాంట్రాక్టులో భాగం. ఈ క్ర‌మంలో ఏడాదికి జీతంగా 5 కోట్ల‌ను అందుకుంటాడు. మ్యాచ్ ఫీజులు, బోన‌స్‌లు అద‌నం. ఇక ఐపీఎల్ లో వేలంలో అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అత‌డిని 27 కోట్ల‌కు కొనుగోలు చేసింది.
4/5
2025 నాటికి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నికర ఆస్తి విలువ రూ 215 నుండి 230 కోట్లుగా అంచనా. అతని ప్రాథమిక ఆదాయం క్రికెట్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, పెట్టుబడుల నుండి వచ్చింది. BCCI గ్రేడ్ A ప్లస్ ఆటగాడిగా ఉన్నాడు. దీంతో బీసీసీఐ ఏటా అత‌డికి 7 కోట్లు వేత‌నంగా చెల్లిస్తుంది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ రూ.16.3 కోట్లు జీతంగా ఇస్తుంది. అతను ఎండార్స్‌మెంట్‌లు, సోషల్ మీడియా సహకారాలు, పెట్టుబడుల ద్వారా ఏటా 50 నుంచి 60 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.
5/5
అత్యంత ధ‌న‌వంతుడైన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 2025 నాటికి అత‌డి నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1,050 కోట్లు అని అంచ‌నా. కోహ్లీ BCCI సెంట్రల్ కాంట్రాక్టులో ఏ+లో ఉన్నాడు. దీంతో అత‌డికి బీసీసీఐ ఏటా 7 కోట్లు జీతంగా ఇస్తుంది. ఇక ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అత‌డికి ప్ర‌తి సీజ‌న్‌కు రూ.21 కోట్లు జీతంగా ఇస్తుంది. అతను ఎండార్స్‌మెంట్‌లు, సోషల్ మీడియా సహకారాలు, పెట్టుబడుల ద్వారా ఏటా రూ 200 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం.