YS Jagan Deepavali Celebrations : దీపావళి వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బెంగళూరులోని వారి నివాసంలో వైఎస్ జగన్, వైఎస్ భారతిలు టపాసులు పేల్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైయస్ జగన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.