Pawar on Shiv Sena: శివసేనపై ఈసీ నిర్ణయం అనంతరం ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ కీలక సూచన

గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వచ్చింది. అయితే కొత్త గుర్తును ప్రజలు ఆదరించారు’’ అని అన్నారు.

Pawar on Shiv Sena: అసలైన శివసేన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం అనంతరం ఉద్ధవ్ థాకరేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక సూచన చేశారు. నిర్ణయం ఏదైనా ఇప్పటికే జరిగిపోయిందని, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంగీకరించమంటూ థాకరేకు సూచించారు. తాజాగా ఈసీ కేటాయించిన కొత్త గుర్తుతో అయినా ప్రజల్లోకి వెళ్లొచ్చని, ప్రజలు దాన్ని కూడా ఆదరిస్తారని ఆయన తెలిపారు.

Actor Naresh : సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు నటుడు నరేశ్.. ఆ కేసు దర్యాఫ్తులో పురోగతిపై ఆరా

‘‘ఇది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. ఒకసారి నిర్ణయం వెలువడ్డాక మళ్లీ దానిపై చర్చలు అనవసరం. నిర్ణయాన్ని అంగీకరించి కొత్త గుర్తును తీసుకోవాల్సిందే. ఇదేమీ ప్రజల్లో అంత పెద్ద ప్రభావాన్ని చూపించదు. ఒక 15-30 రోజుల వరకు మాత్రమే దీనిపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటిలాగానే మనం ప్రజల్లోకి వెళ్లొచ్చు. కొత్త గుర్తును కూడా ప్రజలు ఆదరిస్తారు’’ అని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వచ్చింది. అయితే కొత్త గుర్తును ప్రజలు ఆదరించారు’’ అని అన్నారు.

Vande Bharat train : సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ .. మరికొన్ని రోజుల్లోనే

ఏక్‌నాథ్‌ షిండే వర్గానిదే అసలైన శివసేన అని భారత ఎన్నికల సంఘం గుర్తించింది. శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు