Congress Vs Brs : ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ చేరతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు రోజూ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Congress Vs Brs : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తమకు పెద్ద సమస్య కాదని చెప్పారాయన. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ చేరతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు రోజూ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, కేసీఆర్ ఖేల్ ఖతమై, బీఆర్ఎస్ దుకాణం బంద్ అవడం ఖాయమన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే భునవగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు కూడా కాంగ్రెస్ చేరతారని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.

Also Read : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?

ట్రెండింగ్ వార్తలు