నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.