Ramcharitmanas: “అట్టడుగు కులాలపై ద్వేషాన్ని వ్యాపింపజేసే రామచరితమానస్‌ను కాల్చివేయాలి” అంటూ రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దేశావ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. కాగా అప్పట్లో సంచలన సృష్టించిన ఈ కాంట్రవర్సీ కొన్ని మలుపులు తిరిగి, ఎట్టకేలకు చల్లబడింది. కాగా, అదే పార్టీకి చెందిన మరో నేత, అదే పుస్తకంపై మరో కొత్త వివాదానికి తెరలేపారు. రామచరితమానస్‌ను మసీదులో రాశారని ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన అభిప్రాయం సరైనదని నిరూపించడానికి చరిత్ర పుస్తకాలను ఎంచుకొని తనిఖీ చేయమని రిట్లాల్ యాదవ్ సలహా ఇచ్చాడు.
చంద్రశేఖర్ వ్యాఖ్యలను పునరావృతం చేశారా?
రామచరితమానస్‌పై రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒక కళాశాల కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచరితమానస్‌ను వెనుకబడిన కులాలను అవమానించేలా కలిగి ఉన్నందున వాటిని తగలబెట్టాలని అన్నారు. తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. అయితే ఆయన మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోనని, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నట్లు చంద్రశేఖర్ సమాధానం చెప్పారు.