నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు..!

మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు.

YCP MLA Candidates Of East Godavari District

YCP MLA Candidates : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు సీఎం జగన్ మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చినట్లు సమాచారం. ఇక.. పిఠాపురం(పెండెం దొరబాబు), పి.గన్నవరం(కొండేటి చిట్టిబాబు), జగ్గంపేట(జ్యోతుల చంటిబాబు), ప్రత్తిపాడు(పర్వత ప్రసాద్), రామచంద్రపురం(మంత్రి వేణు) స్థానాల్లో సిట్టింగ్ లను తప్పించి కొత్త వారికి జగన్ ఛాన్స్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారు..
* నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!
* జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు
* మంత్రి వేణుకు స్థాన చలనం..
* మరో మంత్రి విశ్వరూప్ స్థానంలో తనయుడికి ఛాన్స్
* ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇద్దరు ఎంపీలు.. మార్గాని భరత్(రాజమండ్రి), వంగా గీత(కాకినాడ)

Also Read : అన్నా రాంబాబు, మాగుంట మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణమేంటి?

ఉమ్మడి తూర్పుగోదావరి ఇంచార్జ్‌లు(దాదాపుగా ఖరారు)
రంపచోడవరం – నాగులాపల్లి ధనలక్ష్మి

జగ్గంపేట – తోట నరసింహం

ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు

పిఠాపురం – వంగా గీత

కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు

కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

తుని – దాడిశెట్టి రాజా

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్

రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణు

అనపర్తి – సత్తి సూర్యనారాయణ రెడ్డి

ముమ్మిడివరం – పొన్నాడ సతీశ్‌

అమలాపురం – పినిపె శ్రీకాంత్

పి. గన్నవరం – మోకా రమా దేవి

రాజోలు – రాపాక వరప్రసాద్

కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి

మండపేట – తోట త్రిమూర్తులు

రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాశ్‌(ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు)

పెద్దాపురం – దవులూరి దొరబాబు

రాజానగరం – జక్కంపూడి రాజా

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

వైసీపీలో మార్పులకు సంబంధించిన లిస్టు దాదాపుగా సిద్ధమైపోయింది. 45మందితో మార్పులకు సంబంధించిన జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ లిస్టును సీఎం జగన్ రెడీ చేసేశారని, ఇవాళ 11 స్థానాల్లో మార్పులు ప్రకటింబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మిగిలిన స్థానాలకు సంబంధించి రేపు ప్రకటన ఉండనుందని తెలుస్తోంది. ఇవాళ, రేపు పూర్తి మార్పులు ప్రకటించేసి జవనరి 1 నుంచి కొత్త అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లనున్నారని వైసీపీ శ్రేణులు వెల్లడించాయి.

తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ రెడీ..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారు
రంపచోడవరం నియోజకవర్గంలో నాగులుపల్లి ధనలక్ష్మి కొనసాగింపు.
జగ్గంపేట నియోజకవర్గం- సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు నో టికెట్, తోట నర్సింహంకు అవకాశం
ప్రత్తిపాడు – సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు నో టికెట్.. ఆయన స్థానంలో వరుపుల సుబ్బారావుకి అవకాశం. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు.

పిఠాపురం – సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు నో టికెట్.. వంగా గీతకు అవకాశం. వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు.
కాకినాడ రూరల్ – సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి అవకాశం.
కాకినాడ సిటీ – సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరోసారి అవకాశం.
రాజమండ్రి సిటీ – ఎంపీగా ఉన్న మార్గాని భరత్ కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం.
రాజమండ్రి రూరల్ – రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుకు స్థానచలనం. రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి
అనపర్తి – సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యానారయణ రెడ్డికి మరోసారి అవకాశం.
ముమ్మివరం – పొన్నాడ సతీశ్ కు మరో అవకాశం
అమలాపురం – సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పినిపె విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుడు పినిపె శ్రీకాంత్ కు టికెట్ దాదాపుగా ఖరారు.
పి.గన్నవరం- సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానంలో మోకా రమాదేవికి ఛాన్స్.

రాజోలు – జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ కు అవకాశం.
మండపేట – ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులుకు అవకాశం.
కొత్తపేట – సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి మరో అవకాశం.
రామచంద్రపురం – సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి వేణుని తప్పించి రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ కు అవకాశం.
పెద్దాపురం – టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు.. ఇక్కడ వైసీపీగా ఇంఛార్జిగా దవలూరి దొరబాబు కంటిన్యూ
రాజానగరం – సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మరో అవకాశం.
తుని – సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజాకు మరోసారి అవకాశం

ఉమ్మడి తూర్పోగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.