ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

బలమైన అధికార వైసీపీని ఢీకొట్టడం అంత సులభమేమీ కానప్పటికి విజయానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.

ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

TDP Plus And Minus Points

Telugu Desam Party: మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సమరాంగణానికి ఇటు అధికార వైసీపీ అటు ప్రతిపక్ష టీడీపీ తమ బలగాలతో సిద్ధమవుతున్నాయి. వ్యూహా ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి గెలుపు మాదంటే కాదు మాదే అంటూ రెండు పక్షాలు సవాళ్లు – ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. ఓవరాల్ గా బస్తీ మే సవాల్ అంటున్నాయి.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీకి ఈసారి ఎన్నికలు ఎవరు ఔనన్నా.. కాదన్నా.. డూ ఆర్ డై.. అన్నది నిజం.. అందుకే ఎలాగైనా పాగా వేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. బలమైన అధికార వైసీపీని ఢీకొట్టడం అంత సులభమేమీ కానప్పటికి విజయానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.

Also Read : వైసీపీలో టిక్కెట్ల టెన్షన్.. అభ్యర్థుల మార్పుపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేలు చేసే అంశాలేంటి?. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అంశాలేంటి? అనే చర్చ మొదలైంది. ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ అత్యంత కీలకమైనది. అంటే ప్రజలు ఏమని అనుకుంటున్నారనేది.. ఈ ధృక్కోణంలో టీడీపీ ప్లస్ లు, మైనస్ లు ఏంటో ఒకసారి చూద్దాం..

టీడీపీ ప్లస్ పాయింట్స్
బలమైన పార్టీ కేడర్
బీసీల పార్టీగా ముద్ర
చంద్రబాబు పాజిటివ్ దృక్పథం
అభివృద్ధి అజెండా
టెక్నాలజీని సమర్థంగా వాడుకోవడం
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు

రాజకీయాలకు పూర్తి సమయం
అమరావతి రాజధానితో సానుకూలత
జనసేనతో పొత్తు
అరెస్టు తర్వాత సానుభూతి
పార్టీ భవిష్యత్ సారథిగా లోకేశ్ నిరూపించుకోవడం

టీడీపీ మైనస్ పాయింట్స్
వలంటీర్ వ్యవస్థకు దీటైన నెట్‌వర్క్ లేకపోవటం
అధికార పార్టీకి దీటుగా ఆర్థిక బలం లేకపోవడం
భారంగా మారిన సీనియర్లు
కొత్తతరం నాయకుల కొరత
ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో మరోలా ఉంటారనే పేరు

అభివృద్ధి అంటూ పేదల సంక్షేమాన్ని విస్మరించడం
నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చుడు వైఖరి
పనికంటే ప్రచారం ఎక్కువ అనే విమర్శలు
విమర్శించిన పథకాలనే మ్యానిఫెస్టోలో చేర్చడం
బీజేపీ అండ లేకపోతే ఎలక్షనీరింగ్ చేయలేమనే భయం