TDP First List Almost Ready
TDP MLA Candidates List : సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన తొలి విడత చర్చలు పూర్తయ్యాయి. లిస్ట్ కూర్పుపై టీడీపీ కసరత్తు కంప్లీట్ అయ్యింది. సీట్ల సర్దుబాటుపై సంక్రాంతికి ముందే టీడీపీ-జనసేన కూటమి చర్చలు జరపగా.. పండగ తర్వాత ఎనీ టైమ్ లిస్టును విడుదల చేయనున్నారు. టీడీపీ రేసు గుర్రాలు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్స్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను మొదలు పెట్టింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ క్రమంలోనే 72 మందితో కూడిన జాబితాను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు కేటాయించనున్న స్థానాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగానే చంద్రబాబు.. జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో గెలుపొందగా.. ఆ తర్వాత అందులోంచి నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. జాబితాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలాబలాలపై పలు నివేదికలను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో అభ్యర్థులపై ఉన్న ఆదరాభిమానాలను బేరీజు వేసుకుంటూ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులను గమనిస్తూనే.. అందుకు తగినట్లుగా ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. అనేక వడపోతల తర్వాత టీడీపీ జాబితా సిద్ధమైంది ఆ లిస్ట్‌లో ఉన్న టీడీపీ రేసుగుర్రాల వివరాలు ఎక్స్‌క్లూజివ్ గా 10టీవీ మీకు అందిస్తోంది.
Also Read : ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..
టీడీపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారు..! జిల్లాల వారీగా..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు
ఆముదాలవలస – కూన రవికుమార్
పలాస – గౌతు శిరీష
ఎచ్చెర్ల – కళా వెంకట్రావు
రాజాం – కొండ్రు మురళీమోహన్
ఉమ్మడి విజయనగరం జిల్లా
బొబ్బిలి – బేబీ నాయన
చీపురుపల్లి – కిమిడి నాగార్జున
సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
కురుపాం – టి.జగదీశ్వరి
పార్వతీపురం – బి.విజయచంద్ర
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
అరకు – సియ్యారి దొన్నుదొర
వైజాగ్ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు
వైజాగ్ వెస్ట్ – PGVR నాయుడు (గణబాబు)
పాయకరావుపేట – వంగలపూడి అనిత
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
తుని – యనమల దివ్య
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి అర్బన్ – ఆదిరెడ్డి వాసు
గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
చింతలపూడి – బొమ్మాజి అనిల్
ఉమ్మడి కృష్ణా జిల్లా
విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
ఉమ్మడి గుంటూరు జిల్లా
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
వేమూరు – నక్కా ఆనందబాబు
ఉమ్మడి ప్రకాశం జిల్లా
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
ఒంగోలు – దామచర్ల జనార్దన్
కొండేపి – శ్రీబాల వీరాంజనేయస్వామి
కనిగిరి – ఉగ్ర నరసింహారెడ్డి
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా
కోవూరు – పోలంరెడ్డి దినేశ్‌రెడ్డి
ఆత్మకూరు – ఆనం రామనారాయణరెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లా
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌రెడ్డి
నగరి – గాలి భానుప్రకాశ్
పలమనేరు – ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
కడప జిల్లా
కడప – రెడ్డప్పగారి మాధవి
జమ్మలమడుగు – సి.భూపేశ్‌రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్‌యాదవ్
పులివెందుల – బీటెక్ రవి
ప్రొద్దుటూరు- జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
కర్నూలు
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
పాణ్యం – గౌరు చరితారెడ్డి
బనగానపల్లి – బీసీ జనార్దన్‌రెడ్డి
కర్నూలు – టీజీ భరత్
ఎమ్మిగనూరు – బీవీ జయనాగేశ్వరరెడ్డి
అనంతపురం
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
రాప్తాడు – పరిటాల సునీత
తాడిపత్రి – జేసీ అస్మిత్‌రెడ్డి
కదిరి – కందికుంట వెంకటప్రసాద్