భూముల ధరలు పడిపోయాయని ఉద్యమం చేస్తున్నారు : స్పీకర్ తమ్మినేని

  • Publish Date - December 24, 2019 / 09:07 AM IST

ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. కొన్న భూములకు విలువ పడిపోయిందని ఆందోళన చేస్తున్నారా.. అని  నిలదీశారు.

అమరావతిలో భూములు కొట్టేసినవారే ఉద్యమం చేస్తున్నారని  స్పీకర్ మండిపడ్డారు. పచ్చచొక్కాల వారే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు తమ్మినేని సీతారాం. అమరావతిని లెజిస్టేచర్ క్యాపిటల్ గా కంటిన్యూ చేస్తున్నారని అటువంటప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని స్పీకర్ ప్రశ్నించారు.

విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చంద్రబాబు ఆమోదిస్తున్నారా…. వ్యతిరేకిస్తున్నారో  చెప్పాలని  తమ్మినేని సీతారం డిమాండ్ చేశారు. కర్నూలులో హై కోర్టు కావాలా..వద్దా …..అమరావతిలో లెజిస్ట్లేచర్ క్యాపిటల్ కావాలో వద్దో చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.