వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు : సీఎం  చంద్రబాబు

  • Publish Date - February 20, 2019 / 03:48 AM IST

అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందని ఆ పార్టీ నేతలతో అన్నాడు. నేరాలు వాటి ద్వారా కలిగే లబ్ధి వైసీపీకి దొరికిన రాజకీయం ఎద్దేవా చేశారు. 

’పుల్వామా దాడితో మాకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది’ అని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో తెలిపారు. రాజకీయ లబ్ధి ఉందనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతుందన్నారు. స్వార్థం కోసం దేశాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తామంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. దేశాన్ని భ్రష్టు పట్టించే చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని తెలిపారు. దేశప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందన్నారు.