CM Jagan Delhi Tour
CM Jagan Delhi Tour : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు(ఫిబ్రవరి 9) ఉదయం 11గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది. వివిధ అంశాలపై జగన్ చర్చించనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా రాష్ట్రంలో రాజకీయ అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చలు జరిపే అవకాశం ఉంది.
Also Read : లోక్‌సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధుల విడుదలతో పాటు ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదంపై చర్చించనున్నారు. కేంద్రం వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులు విడుదల చేయాలని కోరనున్నారు. 2014 జూన్ నుంచి 2017 వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్ బకాయిల క్లియరెన్స్ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!