దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు, రాజధానిలో కోట కట్టుకున్నారు- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ట్యాబ్‌లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.

CM Jagan Slams Chandrababu Naidu

CM Jagan : విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పేదలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చి జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే వారని, ఇది కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని జగన్ చెప్పారు.

రాజధానిలో పేదలకు చోటు లేకుండా వారు మాత్రమే కోట కట్టుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని పేర్కొన్నారు. ట్యాబ్ లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.

Also Read : జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రశ్నించిన సుప్రీంకోర్టు

” ఇప్పటికీ అంటరానితనం ఉంది. అయితే, ఆ అంటరానితనం రూపం మార్చుకుంది. పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోరుకోవడం కూడా అంటరానితనమే. పేదలు ఎప్పటికీ పేదవాళ్లుగానే ఉండాలట. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలట. అమరావతిలో పేదలకు చోటు లేకుండా చేయాలనుకోవడం అంటరానితనమే. పథకాల అమల్లో కూడా వివక్ష చూపడం అంటరానితనమే. పేదల కోసం చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. అంబేద్కర్ భావజాలం ఈ పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్ల కళ్లు తెరిపించడం కోసమే ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో కాకుండా ఎక్కడైనా చూశారా?” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : జూ.ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?