Pawan Kalyan : తెలంగాణ రావడానికి కారణం జగనే, అందుకే ఆంధ్రోళ్లను తన్ని తరిమేశారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడిస్తానని వార్నింగ్

జగన్ నాయకుడు కాదు వ్యాపారి. డబ్బు పిచ్చి పట్టింది. సింహాచలం సింహాద్రి సాక్షిగా చెబుతున్నా Pawan Kalyan - Janasena

Pawan Kalyan (Photo : Google)

Pawan Kalyan – Janasena : ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖలో జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం జగన్ అని అన్నారు. దానికి కారణాలను ఆయన విశ్లేషించారు. ”జగన్, వాళ్ల గుంపు తెలంగాణలో భూములు దోచుకుంది. అందుకే అక్కడ తరిమేశారు. ఆంధ్రకి పొమ్మన్నారు. ఇక్కడ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, సహజవనరులు కూడా దోచుకుంటున్నారు” అని ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. కేంద్రంతో నిన్ను ఆడిస్తా చూడు అంటూ జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

”తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జగనే. తెలంగాణలో భూములు లాక్కున్నారు. హైదరాబాద్ లో దౌర్జన్యాలు ఎక్కువ చేశారు. అందుకే ఆంధ్రా వాళ్లను తన్ని తరిమేశారు. దానికి ముఖ్య కారణం జగన్. ఏపీలో వైసీపీని తన్ని తరిమేసే వరకు నేను నిద్రపోను. చూడటానికి పలుగా ఉంటాను. కానీ, నా ఒళ్లు మందం. వైసీపీకి ఓటు వేస్తే కొండలు తవ్వేస్తారని గొంతు చించుకుని మరీ చెప్పా. కానీ నా మాటను పట్టించుకోలేదు మీరు” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.

”సుస్వాగతం సినిమా కోసం గతంలో జగదాంబ వచ్చాను. మరోసారి వారాహి వాహనం ఎక్కి జగదాంబ సెంటర్ కి వచ్చాను. నాలో ఉన్న సిగ్గు, భయం పోగొట్టి నాకు నటన నేర్పి అన్నం పెట్టింది విశాఖ. విశాఖ ప్రశాంత నగరం. అలాంటి ప్రశాంత నగరంలో గూండాలు రాజ్యమేలుతున్నారు. అలాంటి గూండాల నుండి రక్షించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. గూండాలకు మేము బెదిరిపోము. కాలానికు రంగు రుచి ఉండదు. కాలంతో పాటు ఎవ్వరైనా పరిగెత్తాల్సిందే. మహిళలు సర్పంచ్ నుండి ప్రధాని స్థాయి వరకు ఎదగాలి. అది విశాఖ నుండే జరగాలని భావించాను.(Pawan Kalyan)

జగన్.. పొద్దున పథకం కింద డబ్బులు ఇస్తాడు. సాయంత్రం సారా కింద పట్టుకుపోతాడు. రాజ్యాంగానికి కట్టుబడి జగన్ పని చెయ్యడు. రాజ్యాంగం సర్వనాశనం చెయ్యడానికి ఒక్కడు వచ్చాడు. మీ బానిసలుగా మేము ఉండము. జగన్ ను నేను ఏకవచనంతో పిలుస్తా. ఆంధ్రకి నియంతలా వ్యవహరిస్తున్నాడు జగన్. నువ్వేమైనా దిగివచ్చావా? ఆంధ్ర నేల కోసం పోరాడిన పొట్టి శ్రీరాములను మరిచిపోయారు. దోచుకున్న రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడుతున్నారు. మాట్లాడే వైసిపి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను భయపడను. మీరూ భయపడకండి. ఈ వైసీపీని ఉత్తరాంధ్ర నుండి, ఆంధ్ర నుండి తన్ని తరిమేసే వరకు జనసేన శ్రమిస్తూనే ఉంటుంది.

Also Read..Renu Desai : ప‌వ‌న్ అరుదైన వ్య‌క్తి.. నా మ‌ద్ద‌తు ఆయ‌నకే.. 11 ఏళ్ల నుంచి దూరంగానే ఉన్నాం.. పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దు

నేను గాజువాకలో ఓడిపోయాను. నాకు బాధలేదు. కానీ రాష్ట్రాన్ని దోచుకునే వాడికి అధికారం ఇచ్చారు. తెలంగాణ రావడానికి కారణం జగన్. వాళ్ల గుంపు తెలంగాణలో భూములు దోచుకుంది. అందుకే అక్కడ తరిమేశారు. ఆంధ్రకి పొమ్మన్నారు. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, సహజ వనరులు దోచుకుంటున్నారు.

నేను ఓడిపోయినప్పుడు జనసేనకు జీవం పోసింది విశాఖ. విశాఖ నాకు తోడు ఉంది. నేను ఓడిపోయినా భుజం తట్టి లేపింది. ఇసుక దోచుకుని భవన నిర్మాణ కార్మికులకు జీవనం లేకుండా చేశారు. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెబితే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ గూండాలు, చిత్తూరు పోలీసులు అన్నారు. కానీ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ ప్రకటించిన దాంతో ఎక్కువగానే మిస్సింగ్ లు ఉన్నాయని తేలింది. నేను అవగాహన లేకుండా ఏదీ మాట్లాడను.(Pawan Kalyan)

సింహాచలం సింహాద్రి సాక్షిగా చెబుతున్నా. వాలంటీర్ వ్యవస్థపై నాకు ద్వేషం లేదు. మీకు 5 వేలు వస్తే ఇంకో 5 వేలు ఇవ్వాలనుకునే వాడిని. మీతో జగన్ తప్పులు చేయిస్తున్నాడు. మీ డేటా అంతా హైదరాబాద్ లోని ఓ గుంపు దగ్గరికి వెళ్తోంది. అన్న అక్క పేరుతో జగన్ దెబ్బకొడతాడు. అన్న అక్క అని పిలిచిన అధికారులు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు.

Also Read..Tirupati: తిరుపతి బరిలో వైసీపీ కొత్త అభ్యర్థి.. తెరపైకి డాక్టర్ శిరీష పేరు!?

పెందుర్తిలో వాలంటీర్ ఏం చేశాడో అందరికీ తెలుసు. వాలంటీర్లు అత్యాచారాలు చేస్తున్నారు. పేద మహిళల డబ్బు దోచుకుంటున్నారు. చిత్తూరు ఎస్పీ వీటికి ఏం సమాధానం చెబుతారు? ఎఫ్ఐఆర్ నమోదు చేసినవే మీ దృష్టికి వస్తాయి. రానివి ఎన్ని ఉంటాయి. వాలంటీర్లు అందరూ అలాంటి వాళ్ళే అని నేను చెప్పడం లేదు. విశాఖలో ఓ రౌడీషీటర్ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడు. ఎంపీకే భద్రత లేదు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఓ ఎమ్మెల్సీ ఓ వ్యక్తిని చంపి దర్జాగా తిరుగుతున్నాడు.

ఆంధ్ర యూనివర్సిటీ 2012లో 29వ ర్యాంకులో ఉంది. ఇప్పుడు 76వ స్థానంలో ఉంది. సెక్యూరిటీ వాళ్లు గంజాయి, మందు అమ్ముతారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏయూని వైసీసీ కార్యాలయం చేశారు, రియల్ ఎస్టేట్ గా మార్చేశారు. దీని గురించి కేంద్రం దృష్టికి తీసుకెళతాం. జగన్.. ఏయూని భ్రష్టు పట్టించావు. నిన్ను కేంద్రంతో ఆట ఆడిస్తా చూడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం విశాఖ డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. 25వేల కోట్లకు 128.75 ఎకరాల ప్రభుత్వ భూములు, భవనాలు తాకట్టు పెట్టారు. జగన్ నాయకుడు కాదు వ్యాపారి. జగన్ కు డబ్బు పిచ్చి. ఇంకా ఎన్ని కోట్ల తింటావు జగన్. మద్యం ద్వారా 30వేల కోట్లు సంపాదించాడు. మద్యపాన నిషేధం అని మొబైల్ మద్యం షాపులు తెచ్చాడు” అని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్.

ట్రెండింగ్ వార్తలు