YCP Incharges Changes
YCP MLAs : వైసీపీలో మార్పులు చేర్పులు ఎప్పుడు ఎవరి సీటుకి ఎసరు పెడతాయో తెలియని పరిస్థితి. రోజుకో పేరు ప్రచారంలోకి వస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఏ ఒక్కరిలోనూ సీటు ధీమా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లకు మంత్రిమండలిని మార్చేస్తాను అని చెప్పిన సీఎం జగన్ అప్పట్లో చెప్పినట్లే చేశారు. ఇప్పుడు కూడా.. గతంలో హెచ్చరించినా పనితీరు మార్చుకోని నేతలను పక్కన పెట్టేస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న వారు సైతం సీఎం నిర్ణయంతో సైలెంట్ అయిపోతున్నారు.
Also Read : చంద్రబాబు సంచలనం, కేశినేని నానికి చెక్.. అసలేం జరిగింది? పక్కన పెట్టడానికి కారణాలేంటి?
గతంలో క్యాబినెట్ లో పని చేసిన మంత్రులు ప్రస్తుతం మినిష్టర్లుగా ఉన్న వారు.. హైకమాండ్ ఆదేశాలతో సైడ్ అయిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి నుంచి దూరం చేసింది పార్టీ. ఎక్కడ సీటు ఇస్తారో ఇంకా చెప్పలేదు. మంత్రులు వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునకు ఇప్పటికే స్థానాలు మార్చేశారు. ఈ లిస్టులో ఇంకొందరు మంత్రులు, మాజీ మంత్రుల పేర్లు వినిస్తున్నాయి. ఇంతకీ వైసీపీ హైకమాండ్ ఆలోచనలు ఏంటి? జాబితాలో గల్లంతయ్యే ముఖ్య నేతలు ఎవరు? మొత్తం మంత్రులు, మాజీమంత్రుల భవితవ్యంపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..
Also Read : రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి