Breaking news: కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశం

  • Publish Date - August 24, 2020 / 01:53 PM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ఆదేశించింది. నలుగురు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.



రిటైర్డ్ సీఈ సుధాకర్, రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుగుణాకర్ రావు, ఈఈ రవిబాబుపై ఎంక్వైరీ జరగనుంది. దుర్గాఘాట్, పవిత్ర సంగమం, పుష్కర ఘాట్ దగ్గర పనులపై విచారణ చేపట్టనున్నారు.