అమరావతి రాజధానిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రియలో ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు.
అమరావతి రాజధానిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రియలో ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిపై గురువారం (డిసెంబర్ 5, 2019) విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తుళ్లూరులో రైతుల ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరై బుగ్గన రాతజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని అన్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఆధారాలున్నాయని చెప్పారు. ఒక వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలి కావాల్సిరావడం బాధాకరం అన్నారు. చంద్రబాబు రైతులను మభ్యపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాజధానిపై కావాలనే ముందు గందరగోళం సృష్టించారని చెప్పారు. శివరామకృష్ణయ్య రిపోర్టును సమర్పిస్తే దాన్ని చర్చకు తీసుకొని రాలేదని విమర్శించారు. కనీసం అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదన్నారు. లోలోపల వ్యాపారం చేసేదానికి కూడుకుని ఉన్నారని ఆరోపించారు.