ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముఖం చాటేశారు. అసలు ఏమిటా ప్రాంతం.. ఎవరూ ఎందుకు రావడం లేదు.
సచివాలయంపై స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం:
నిత్యం సందర్శకులతో కళకళలాడుతుండే ఏపీ సెక్రటేరియట్ జనం లేక వెలవెలబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం ఏపీ సచివాలయంపై స్పష్టంగా కనబడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. దీంతో సచివాలయంలో పనులు చేయించుకొనేందుకు వచ్చే సందర్శకులు రావడం లేదు. మంత్రులతో పనులు ఉన్నవారు కూడా సెక్రటేరియట్ కు రావడం మానేశారు. దీంతో సచివాలయంలో హడావుడి పూర్తిగా తగ్గిపోయింది.
సంక్షేమ పథకాలపై ఆగిన రివ్యూలు:
ఎన్నికల కోడ్ కారణంగా సంక్షేమ పథకాలపై రివ్యూలు ఆగిపోయాయి. దీంతో అధికారులు కూడా ఎక్కువగా హెచ్‌వోడీ కార్యాలయాలకే పరిమితమై పనులు చూసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులకు అర్జెంట్ ఫైళ్ల పని తగ్గింది. ఈ నేపధ్యంలో ఉద్యోగులు పెండింగ్ ఫైళ్ల ప్రక్షాళనలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజా ప్రతినిధులు అందరూ బిజీ బిజీగా ఉండటంతో సచివాలయం మాత్రం సందర్శకులు కరువై వెలవెలబోతోంది.
See Also | కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్