Azam Khan: మరోసారి చిక్కుల్లో అజాం ఖాన్.. ఈసారి విధ్వేష ప్రసంగాలు చేశారంటూ కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‭లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్‭వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్‭వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశ పూర్వకంగానే అజాం ఖాన్‭ను జైలుకు పంపిందని అఖిలేష్ సహా అనేక ఇతర నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు

Azam Khan: సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన విధ్వేష ప్రసంగాలు చేశారంటూ తాజాగా కేసు నమోదు అయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన.. వివిధ కేసుల వల్ల సుమారు 27నెలల పాటు జైలు జీవితం గడిపారు. రెండేళ్ల జైలు జీవితం అనంతరం మధ్యంతర బెయిల్ లభించడంతో ఈ యేడాది మే నెలలో విడుదల అయ్యారు.

కాగా, ఆయనపై తాజాగా విధ్వేష ప్రసంగాలు చేశారంటూ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. 2019లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఈ కేసులో రాంపూర్ కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో నమోదైంది. ఒకవేళ ఇవే నిరూపితమైతే ఆయన తొందరలోనే తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. అనంతరం మరో రెండేళ్ల పాటు జైలు శిక్ష పడనుంది.

ఉత్తరప్రదేశ్‭లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్‭వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్‭వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశ పూర్వకంగానే అజాం ఖాన్‭ను జైలుకు పంపిందని అఖిలేష్ సహా అనేక ఇతర నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు. ఇక అజాం ఖాన్ తొందరలోనే సమాజ్‭వాదీ పార్టీని విడిచి పెట్టనున్నట్లు కూడా కొద్ది రోజుల క్రితం వార్తలు గుప్పుమన్నాయి. ఎస్పీకి గుడ్ బై చెప్పి బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

TRS MLAs trap issue : MLAల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ..హైకోర్టులో బీజేపీ పిటిషన్..

ట్రెండింగ్ వార్తలు