TRS MLAs trap issue : MLAల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ..హైకోర్టులో బీజేపీ పిటిషన్..

టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి కుట్ర జరిగిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఫామ్ హౌజ్ లో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కుట్రపై బీజేపీ టీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడుతోంది. ఈ కుట్ర ఏంటో తేలుస్తాం అంటూ బీజేపీ కోర్టుమెట్లెక్కింది. హైకోర్టులో పిటీషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని పిటీషన్ లో కోరింది బీజేపీ.

TRS MLAs trap issue : MLAల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ..హైకోర్టులో బీజేపీ పిటిషన్..

TRS MLAs trap issue..bjp files HC

TRS MLAs trap issue..bjp files HC : టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి కుట్ర జరిగిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఫామ్ హౌజ్ లో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కుట్రపై బీజేపీ టీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడుతోంది. ఇందంతా బీజేపీ కుట్రం అంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న మాటలదాడిపై తీవ్రంగా మండిపుతున్నారు బీజేపీ నేతలు. మునుగోడులో ఓడిపోతామనే భయనంతోన టీఆర్ఎస్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందంటూ విమర్శలను తిప్పికొడుతున్నారు. ఈక్రమంలో ఈ కుట్ర ఏంటో తేలుస్తాం అంటూ బీజేపీ కోర్టుమెట్లెక్కింది. హైకోర్టులో పిటీషన్ వేసింది.

ఫామ్ హౌజ్ ఘటనపై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదికగా జరిగిన ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని..సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ తన పిటిషన్ లో హైకోర్టును అభ్యర్థించింది. 8మందిని ప్రతివాదులుగా చేర్చింది బీజేపీ.తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ,మొయినాబాద్ ఎస్ హెచ్ వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులగా పిటీషన్ లో చేర్చింది బీజేపీ.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే… తెలంగాణ పోలీసు శాఖ విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు రావని కూడా బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని కోరింది. బీజేపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దానిపై విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.

కాగా..మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన పెను సంచలనానికి దారితీసింది. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి కుట్ర పన్నిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే..మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ రాత్రికి రాత్రే డ్రామా ప్లాన్ చేసిదంటోంది బీజేపీ. ఈ వ్యవహారం కాస్తా మునుగోడు ఉప ఎన్నికను మరింత హీటెక్కిస్తోంది.