Arvind Kejriwal: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండమంటూ పార్టీ నేతలను హెచ్చరించిన అరవింద్ కేజ్రీవాల్

దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.

Arvind Kejriwal: జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిన మర్నాడే ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికే పలువురు ఆప్ నేతలు జైలులో ఉన్నారు. దీనికి తోడు పార్టీకి తాజాగా జాతీయ స్థాయి గుర్తింపు కూడా వచ్చింది. దీంతో తమ పార్టీకి బాధ్యత పెరగడమే కాకుండా దాడులు కూడా పెరుగుతాయనే సందర్భంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ సంబరాలు చేసుకున్నారు.

Amit Shah: మూడోసారి కూడా బీజేపీయేనట.. ఎన్ని సీట్లు వస్తాయో లెక్క చెప్పిన అమిత్ షా

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘జాతి వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. దేశ ప్రగతిని అడ్డుకోవాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులంతా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకం. జైలుకు వెళ్లడానికి భయపడేవారు పార్టీని వదిలిపెట్టాలి. భారత దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు మా పార్టీలో చేరాలని ప్రజలను కోరుతున్నాను. మాకు దేవుని మద్దతు ఉంది. నిఖార్సయిన నిజాయితీ, దేశభక్తి, మానవత్వం మా పార్టీకి మూడు స్తంభాలు’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Rahul Gandhi: వయనాడ్‭లో భారీ ర్యాలీ చేపట్టిన రాహుల్ గాంధీ.. అనర్హతపై తీవ్ర విమర్శలు

దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్న ఎన్సీపీ(NCP), సీపీఐ(CPI), టీఎంసీ(TMC) పార్టీలు జాతీయ హోదాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అధికారంలో ఉంది. గుజరాత్‌లో తక్కువ సీట్లు వచ్చినా ఓట్ షేర్ గణనీయంగా ఉండటంతో జాతీయ హోదా దక్కింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్‌కు ఉనికి ఉంది.

ట్రెండింగ్ వార్తలు