Amit Shah: మూడోసారి కూడా బీజేపీయేనట.. ఎన్ని సీట్లు వస్తాయో లెక్క చెప్పిన అమిత్ షా

ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట్ల అసభ్యపదాలు వాడతారని, అబద్ధాలు ప్రచారం చేస్తుంటారని అన్నారు

Amit Shah: మూడోసారి కూడా బీజేపీయేనట.. ఎన్ని సీట్లు వస్తాయో లెక్క చెప్పిన అమిత్ షా

Narendra Modi

Amit Shah: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కాగా, మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంతే కాదు, ఈసారి తమకు 300 సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపుగా ఆ సీట్లే మళ్లీ గెలుస్తామని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

Rajasthan: కాంగ్రెస్ గుర్తులేమీ లేకుండా సొంత ప్రభుత్వం మీదే నిరహార దీక్ష చేపట్టిన సచిన్ పైలట్

ప్రస్తుతం ఆయన అస్సాం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 14 లోక్‭సభ స్థానాల్లో 12 స్థానాలు బీజేపీయే గెలుస్తుందని అన్నారు. ‘‘నరేంద్రమోదీ మూడవసారి ప్రధానమంత్రి అవుతారు. 2024 ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుంది’’ అని అన్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మీద అమిత్ షా సెటైర్లు విసిరారు. భారత్ జోడో యాత్ర చేసినా ప్రయోజనం లేకపోయిందని, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురుదెబ్బ

ఇక ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట్ల అసభ్యపదాలు వాడతారని, అబద్ధాలు ప్రచారం చేస్తుంటారని అన్నారు. కానీ తమపై కాంగ్రెస్ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా, ఎంతటి ధ్వేషాన్ని చూపించినా, తమ ఎదుగుదలను మాత్రం ఆపలేదంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.