Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురుదెబ్బ

అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా కేఎస్ ఈశ్వరప్ప తీరు ఉంది.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురుదెబ్బ

Karnataka Elections 2023

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections 2023) పోటీ చేయబోనని చెప్పారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా కేఎస్ ఈశ్వరప్ప తీరు ఉంది. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈశ్వరప్ప లేఖ రాశారు.

“గత 40 ఏళ్లుగా పార్టీ నాకు ఎన్నో బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. బూత్ స్థాయి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు పార్టీలో నా ప్రయాణం కొనసాగింది. డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశాను. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోను” అని ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఈశ్వరప్పకు ఈ ఏడాది జూన్ లో 75 ఏళ్లు వస్తాయి.

తమ నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, పదవుల్లో ఉండాలనుకుంటే వయసు పరిమితి నిబంధనను పాటించాలని బీజేపీ చెబుతుంది. ఈశ్వరప్ప ఇటీవల పలు సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లలో గెలవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

Karnataka Elections 2023 : రైతు కొడుకులను వివాహం చేసుకునే యువతులకు రూ.2 లక్షలు కానుక : కుమారస్వామి