Karnataka Elections 2023 : రైతు కొడుకులను వివాహం చేసుకునే యువతులకు రూ.2 లక్షలు కానుక : కుమారస్వామి

రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.

Karnataka Elections 2023 : రైతు కొడుకులను వివాహం చేసుకునే యువతులకు రూ.2 లక్షలు కానుక :  కుమారస్వామి

Karnataka Assembly Elections 2023

Karnataka Assembly Elections 2023 : ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నేతల హామీల వర్షం కురిపిస్తుంటారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు హామీల జల్లు కురిపిస్తున్నారు.దీంట్లో భాగంగానే కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి అమ్మాయిలకు నగదు కానుక ప్రకటించారు.రైతుకుటుంబాల్లో అబ్బాయిల్ని వివాహం చేసుకుంటే రూ.2లక్షలు నగదు బహుమతి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు.

తాము అధికారంలోకి వస్తే రైతుల కుటుంబంలో అబ్బాయిలకు వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. మే 10న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగున్న క్రమంలో కోలార్‌లో నిర్వహించిన ‘పంచ‌రత్న’ ర్యాలీలో కుమార‌స్వామి ప్రసగంలో ఈ హామీ ఇచ్చారు. రైలు కుటుంబాల్లో పెళ్లిళ్లను ప్రోత్సహించటానికి ఈ హామీ ప్రకటించామని తాము అధికారంలోకి వస్తే ఇక రైతుల కుటుంబాల్లో పెళ్లిళ్లు కాలేదనే సమస్య తీరిపోతుందన్నారు.

రైతుకుటుంబాల్లో అబ్బాయిలను వివాహం చేసుకోవటానికి అమ్మాయిలు ఆసక్తి చూపించటంలేదని తాము అధికారంలోకి వస్తే రైతుకుటుంబాల్లో పెళ్లిళ్ల సమస్య తీరిపోతుందన్నారు. దీని వల్ల అబ్బాయిలకు పెళ్లిళ్లు అవుతాయి..అమ్మాయిలకు ఆసరాగా ఉంటుందన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవటానికి తాము ప్రవేశపెట్టే కార్యక్రమాల్లో ఇదో భాగమని తెలిపారు.

‘‘రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు యువ‌తులు సుముఖంగా లేర‌ని నా దృష్టికి వ‌చ్చింది. అందుకే రైతుల పిల్ల‌ల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు.. వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువ‌తుల‌కు మా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తుంది’’ అని చెప్పారు. మన పిల్లల ఆత్మ గౌర‌వాన్ని కాపాడేందుకు ఈ ప‌థకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.

కాగా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు మే 10న జ‌ర‌గ‌నున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 224 స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కనీసం 123 స్థానాలను సాధించాలని జేడీ(ఎస్‌) టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 93 మంది అభ్యర్థులను ప్రకటించింది.గతంలో జేడీఎస్ అధికారంలోకి వచ్చిన బీజేపీ పక్కా వ్యూహాలతో మధ్యలోనే కుమార స్వామి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ తనదైన శైలిలో వ్యూహాలతో అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ గెలుపు కోసం ఎన్నికల ఎజెండాను పక్కా వ్యూహంతో సిద్ధం చేసుకుంది.దీంట్లో భాగమే రైతు కుటుంబాల్లో అబ్బాయిలను వివాహంచేసుకుంటే అమ్మాయిలకు రూ.3లక్షల కానుకగా ప్రకటించారు.