BJP Second List
BJP Second List : ఇక లోక్ సభ ఎన్నికల రెండో విడత అభ్యర్థుల జాబితాపైనా బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కోర్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా విడివిడిగా భేటీ అవుతున్నారు. ఇవాళ ఏపీ, కర్నాకట, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు. మొదట ఒడిశా కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ప్రారంభమైంది.
ఏపీలో పొత్తులు, అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పురంధేశ్వరి హైకమాండ్ కు వివరించారు. ఈ సమావేశంలోనే ఏపీలో పొత్తుల అంశంపైనా రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
రెండో విడత లిస్ట్ లో మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ. పొత్తులు ఉండే రాష్ట్రాలు.. మహారాష్ట్ర (శివసేనతో పొత్తు) ఇప్పటికే అక్కడికి వెళ్లి అమిత్ షా చర్చలు జరిపారు. అలాగే ఏపీలో పొత్తు పెట్టుకుంటారా? ఒంటరిగా వెళతారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశంలో పురంధేశ్వరి, సోమువీర్రాజు పాల్గొన్నారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు? ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? గెలుపు అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి? ఒంటరిగా పోటీ చేయాలా? పొత్తులతో ముందుకెళ్లాలా? అన్న దానికి సంబంధించి జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో కూడా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలను బీజేపీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించినట్లు సమాచారం.
Also Read : టీడీపీ 25, జనసేన 10..! కూటమి సెకండ్ లిస్ట్ రెడీ..!
పూర్తి వివరాలు..